
కేటీఆర్ అరెస్ట్.. బోయిన్పల్లి పీఎస్‌కు తరలింపు
హైదరాబాద్, సెప్టెంబర్8(క్విక్ టుడే న్యూస్):
మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్‌ను కలిసేందుకు కూడా అనుమతించకుండా కేటీఆర్‌ను అడ్డుకోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ శ్రేణులకు పోలీసులే సహకరిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ‘ఇదేం చిల్లర రాజకీయం?’ అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.



