Back to FeedQuickToday Shorts

Telangana
Aug 7, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
సమృద్ధిగా వర్షాల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!
తెలంగాణ రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు జలకళను సంతరించుకుని రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ 'వరుణ యాగం' నిర్వహించాలని నిర్ణయించారు.సీఎం సూచనల మేరకు, యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు మరియు పండితులు ఈ యాగం నిర్వహణకు ఆగస్టు 10వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు.
ఈ ప్రతిష్టాత్మకమైన వరుణ యాగం నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద జరగనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఈ యాగానికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.



