Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
మా అమ్మపై రేవంత్‌కు ఎందుకంత పగ.. కన్నీరుమున్నీరైన కొండా సుస్మిత!
కొండా సురేఖను తెలంగాణ కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంపై ఆమె కుమార్తె సుస్మిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మాట్లాడిన మాటలకు తన తల్లిని బలి చేయడం సరికాదంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
ఒక వ్యక్తిని ఉద్దేశించి తాను మాట్లాడితే..
తన తల్లిపై సీఎం రేవంత్ రెడ్డి పగ పెంచుకున్నారని ఆరోపించారు.
సాధారణ ఎంపీపీ స్థాయి నుంచి తన తల్లి అంచెలంచెలుగా ఎదిగారని, ఆమె శాఖలో ఎలాంటి తప్పు జరగలేదని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలతో తాను కంటినిండా నిద్రపోవడం లేదని, కనీసం భోజనం కూడా చేయలేకపోతున్నానని సుస్మిత బోరున విలపించారు.





