Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
తెలంగాణ వెదర్ అప్డేట్: రానున్న రెండు గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
రానున్న రెండు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు.
కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు.
భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక రాజధాని హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మాత్రం ఎలాంటి వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు.





