Back to FeedQuickToday Shorts

Telangana
Aug 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
శరణ్య, మీడియా సంస్థలపై డాన్సర్ మాధురి పోలీసు కేసు
తన పరువుకు భంగం కలిగించారని, అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు.
ఈ నెల 19న తోటి డాన్సర్ ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించి, తన ఐఫోన్ లాక్కున్నారని ఆమె వేములవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.అంతేకాకుండా, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన వ్యక్తిగత ఇమేజ్ను దెబ్బతీసేలా వ్యవహరించారని మాధురి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆమె ఫిర్యాదు ఆధారంగా, శరణ్యతో పాటు కొన్ని మీడియా కంపెనీలపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ వీరప్రసాద్ వెల్లడించారు.
ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



