
అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?: కాంగ్రెస్ శ్రేణుల నిలదీత
తెలంగాణ రాజకీయాల్లో అసెంబ్లీ సమావేశాలు, నేతల మధ్య వాగ్వాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
'కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేరు' అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో స్పందించింది.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కౌంటర్ ఇస్తున్నాయి.
"అదే నిజమైతే కేసీఆర్ స్వయంగా అసెంబ్లీకి రావొచ్చు కదా?" అని ప్రశ్నిస్తున్నాయి.
కేటీఆర్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందనేది నిజమైతే, బీఆర్ఎస్కు అంతకంటే కావాల్సింది ఇంకేముంటుందని నిలదీస్తున్నాయి.మరోవైపు, అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజా సమస్యలపై మాట్లాడకుండా తప్పించుకుంటున్న కేసీఆర్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున ధర్నాలు చేపట్టారు.
ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.





