Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వైద్య విద్యార్థులకు శుభవార్త: ఏపీ, తెలంగాణల్లో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది.
రెండు రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ సీట్లు భారీగా పెరిగాయి.
తాజాగా తెలంగాణలో 1,010, ఆంధ్రప్రదేశ్లో 525 కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయి.తాజా పెంపుతో తెలంగాణలోని మొత్తం 66 కాలేజీల్లో (36 ప్రభుత్వ, 30 ప్రైవేట్) సీట్ల సంఖ్య 10,450కి చేరింది.
అలాగే, ఏపీలోని 40 మెడికల్ కాలేజీల్లో (19 ప్రభుత్వ, 21 ప్రైవేట్) మొత్తం సీట్ల సంఖ్య 7,615కి పెరిగింది.
కాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 836 మెడికల్ కాలేజీల్లో మొత్తంగా 1,40,214 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఎన్ఎంసీ వెల్లడించింది.
Tags:#Telangana#National#Shorts





