Back to FeedQuickToday Shorts

Telangana
Sep 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
హైదరాబాద్ రంజీ జట్టు సారథిగా మహ్మద్ సిరాజ్
భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెలక్షన్ కమిటీ కీలక బాధ్యతలు అప్పగించింది.
2026-27 రంజీ ట్రోఫీ సీజన్‌కు హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా సిరాజ్‌ను అధికారికంగా నియమించింది.
అలాగే, జట్టు వైస్ కెప్టెన్‌గా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చామ మిలింద్ ఎంపికయ్యాడు.గత రంజీ సీజన్లో ముంబై, ఛత్తీస్‌గఢ్‌లతో జరిగిన మ్యాచ్‌లకు కూడా సిరాజ్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్ పరాజయం పాలైంది.
ఇప్పుడు రాబోయే కొత్త సీజన్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా సిరాజ్ జట్టును విజయాల బాటలో ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
Tags:#Telangana#National#Shorts





