Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అసెంబ్లీకి ముందు పొలిటికల్ హీట్: రేపు కేసీఆర్ భేటీ.. కాంగ్రెస్ మహాధర్నా!
తెలంగాణలో ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి.
రేపు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ (BRSLP) సమావేశం జరగనుంది.
కాంగ్రెస్ పాలనపై అసెంబ్లీలో నిలదీసే వ్యూహాలను ఇందులో ఖరారు చేయనున్నారు.మరోవైపు, కాంగ్రెస్ పార్టీ సైతం బీఆర్ఎస్కు కౌంటర్ ఎటాక్ సిద్ధం చేసింది.
ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదని విమర్శిస్తూ..
కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు.
ఒకరు సభలో ప్రశ్నించాలని చూస్తుంటే, మరొకరు సభకు రావడం లేదని రోడ్డెక్కుతుండటంతో రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది.



