Back to FeedQuickToday Shorts

Telangana
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
గణేష్ నిమజ్జనం, భారీ వర్షాలు: రెండు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు
గణేష్ నిమజ్జన వేడుకలు మరియు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
ఎల్లుండి జరగనున్న నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14వ తేదీని వర్కింగ్ డేగా ప్రకటించింది.మరోవైపు, భారీ వర్షాల నేపథ్యంలో రేపు కూడా పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.
ఏపీలోని పోలవరం ప్రాంతంతో పాటు, తెలంగాణలోని మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించడం జరిగింది.



