Back to FeedQuickToday Shorts

Telangana
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జగన్‌తో కుమ్మక్కై నీటిని కోల్పోయాం: కోమటిరెడ్డి
నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో కేసీఆర్ కుమ్మక్కవడం వల్లే తెలంగాణ నీటి హక్కులను కోల్పోయిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించేందుకు కేసీఆర్ అప్పట్లో కావాలనే అవకాశమిచ్చారని ఆయన ఆరోపించారు.
దీనివల్ల ప్రస్తుతం శ్రీశైలం నుంచి ప్రతిరోజూ 10 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ చేసిన ఆ చారిత్రక తప్పిదం, పాపం వల్లే రాష్ట్రానికి రావాల్సిన సాగు, తాగునీటి హక్కులను పూర్తిగా కోల్పోయామని తెలిపారు.
ఈ నష్టానికి బాధ్యుడైన కేసీఆర్ తక్షణమే తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
Tags:#Telangana#National





