
జాతీయ బాక్సింగ్ బరిలో సమద్ సత్తా
యువ క్రీడాకారుడికి రూ.5 వేల ఆర్థిక ప్రోత్సాహం
శివ్వంపేట, ఆగస్ట్ 15 (క్విక్ టు డే న్యూస్):
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నవాపేట గ్రామానికి చెందిన 16 ఏళ్ల జాతీయస్థాయి బాక్సింగ్ క్రీడాకారుడు ఎండీ. సమద్‌ను ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే బాక్సింగ్‌లో ప్రతిభ కనబరుస్తూ జాతీయస్థాయిలో రాణిస్తున్న సమద్‌ను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకుడు బాలకుంద ఇంద్రేష్ రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సమద్ మరింత కష్టపడి సాధన చేసి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించే అవకాశం ఉంటుందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. సమద్ సాధించిన ప్రతిభ గ్రామానికి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్‌రెడ్డి, ఉపసర్పంచ్ నల్ల హరిగౌడ్, రవిగౌడ్, సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వార్డు సభ్యులు కమ్మరి నరేందర్‌చారి, రాంపల్లి స్వామి, ఎండీ. ముస్తఫా, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.





