Back to FeedQuickToday Shorts

Telangana
Aug 13, 2026Short Read
లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్?
పినపాక నియోజకవర్గానికి చెందిన BRS పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశారని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల పేరుతో డబ్బులు కూడా తీసుకున్నారని ఓ మహిళ ఇటీవల ఆయనపై ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా, తనకు తెలియకుండా ప్రైవేట్ వీడియోలు తీసి వేధింపులకు గురిచేశారని కూడా బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించారు.
ఈ వార్తలపై పోలీసుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.





