
కేంద్రం పర్మిషన్ నిరాకరణ.. రేవంత్ అమెరికా టూర్‌కి సాంకేతిక అడ్డంకులు! కారణం ఇదే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ లభించకపోవడంపై ఆసక్తికరమైన కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి..
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అలాగే న్యూయార్క్ నగర మేయర్ తో ప్రత్యేకంగా సమావేశం కావాలని ప్రణాళికలు రచించినట్లు సమాచారం.అయితే, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల్లో విదేశీ నేతలతో సమావేశాలకు సంబంధించిన ప్రోటోకాల్ విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ ద్వారా ముందుస్తు షెడ్యూల్ ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
కానీ, రేవంత్ రెడ్డి పర్యటనలో ఈ అధికారిక షెడ్యూలింగ్ జరగలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్లు జాతీయ మీడియా (NDTV) వెల్లడించింది.
విదేశాంగ శాఖ ద్వారా ఈ కీలక భేటీలు ఖరారు కాకపోవడమే 'పొలిటికల్ క్లియరెన్స్' రాకపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.కేంద్రం అనుమతి నిరాకరించడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు, విభేదాలు లేవని, కేవలం ఈ సాంకేతిక, ప్రోటోకాల్ కారణాల వల్లనే పర్మిషన్ లభించలేదు.





