Back to FeedQuickToday Shorts

District
Aug 11, 2026Short Read
చేయూత పెన్షన్‌కు ఆగస్టు 31లోగా దరఖాస్తులు
తొర్రూరు చేయూత పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31లోగా దరఖాస్తులు సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్ ఒక ప్రకటనలో కోరారు.వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు,ఫైలేరియా,డయాలసిస్ పెన్షన్లకు అర్హత కలిగిన వారు సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.అర్హులైన వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.





