Back to FeedQuickToday Shorts

District
Oct 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
మహబూబాబాద్, అక్టోబర్21(క్విక్ టుడే న్యూస్):
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ అన్నారు.బుధవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌తో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు. అమరవీరుల స్ఫూర్తితో పోలీసులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.



