
నాలుగు మండలాల ఈవెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,(క్విక్ టు డే న్యూస్).
మణుగూరు,అశ్వాపురం,పినపాక, కరకగూడెం మండలాల టెంట్ డెకరేషన్,ఈవెంట్స్ అసోసియేషన్
నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలు బొంబే కాలనీ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం విజయవంతంగా జరిగినట్లు నూతనంగా ఎన్నుకోబ డిన అధ్యక్ష, కార్యదర్శులు వజ్జా నరేష్, అమర్,కోశాధికారి ఉమామ హేశ్వర్ డాన్స్ మాస్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈఎన్నికల్లో నాలుగు మండలాల కు సంబంధించి 114 మంది టెంట్, డెకరేషన్, ఈవెంట్స్ ఓనర్స్ సభ్యులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల అనంతరం అధ్యక్షులు,వజ్జ నరేష్
కార్యదర్శి,అమర్,కోశాధికారి,ఉమా మహేశ్వర్ ఎన్నికైనట్లు తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, టెంట్,డెకరేషన్స్,ఈవెంట్స్ అసోసియేషన్ ఓనర్లు అందరు, ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియో గించుకున్నందుకు అదేవిధంగా నూతన కమిటీని ఎన్నుకోవడం కోసం పిలవగానే నూట పద్నాలుగు మంది విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.





