
తులస్య తండాలో
20 లీటర్ల గుడుంబా స్వాధీనం..
తొర్రూరు, ఆగస్టు16(క్విక్ టుడే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని తులస్య తండాలో గుడుంబా తయారీ కేంద్రాలపై పోలీసులు తెల్లవారుజామున దాడులు నిర్వహించారు. ఎస్సై మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీకి సిద్ధం చేసిన సుమారు 300 లీటర్ల బెల్లం, చక్కెర మాష్ను ధ్వంసం చేశారు.గుడుంబా తయారీలో పాల్గొన్న ముగ్గురిపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అనంతరం గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడుంబా, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. గుడుంబా,డ్రగ్స్ నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్సై మహేందర్రెడ్డి సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా గుడుంబా తయారీ లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.





