Back to FeedQuickToday Shorts

District
Aug 22, 2026Short Read
స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. విద్యార్థులకు తప్పిన ముప్పు
తొర్రూరు ఆగస్టు 22(క్విక్ టుడే న్యూస్) మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఓ స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది.
సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.స్థానికుల వివరాల ప్రకారం..
బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో రెండు లారీలు బస్సును ఢీకొన్నట్లు తెలిపారు.
బస్సులో సుమారు 50 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదంలో విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.స్కూల్ బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.





