
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలి
దిల్సుఖ్నగర్, సెప్టెంబర్4(క్విక్ టుడే న్యూస్):
సంస్కృతీ సంప్రదాయాలు తెలుసుకోవాలని శ్రీ చైతన్య స్కూల్ దిల్ సుక్కు నగర్ ఏజీఎం వెంకటరెడ్డి విద్యార్థులకు సూచించారు. హయత్ నగర్ పరిధిలోని సాయి నగర్ బ్రాంచ్ శ్రీ చైతన్య స్కూల్లో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఏజీఎం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణుడి జీవితం విద్యార్థులకు ఎన్నో విలువైన పాఠాలు నేర్పింది అన్నారు. శ్రీ చైతన్య స్కూల్ హెచ్ఎం అంజనీ దేవి మాట్లాడుతూ శ్రీకృష్ణుడు గొప్ప జ్ఞాని, ధర్మ పరిరక్షకుడు అని కొనియాడారు. జీవితంలో ఎన్నో సమస్యలను శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఎదుర్కొన్నాడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ కోఆర్డినేటర్ రఘు వంశీ, డీన్ రఘుపతి, సి బ్యాచ్ ఇంచార్జ్ సోమయ్య, ప్రైమరీ ఇంచార్జ్ స్వరూప రాణి, ఏవో ప్రమోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



