Back to FeedQuickToday Shorts

District
Sep 9, 2026Short Read
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
జనగామ, సెప్టెంబర్ 09 (క్విక్ టుడే న్యూస్):
జనగామ: జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జనగామ మున్సిపల్ చైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణను అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కన్నా పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.




