Back to FeedQuickToday Shorts

General
Aug 7, 2026Short Read
ఉమెన్స్ ఆసియా కప్: సెప్టెంబర్ 5న భారత్, పాక్ ఢీ!
క్రికెట్ అభిమానులకు శుభవార్త.
ఉమెన్స్ ఆసియా కప్ టోర్నీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ తేదీ ఖరారైంది.
సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ దాయాదుల పోరు జరగనుంది.ఈ టోర్నీలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-A లో భారత్, పాకిస్థాన్‌తో పాటు థాయ్‌లాండ్, హాంకాంగ్, చైనా జట్లు ఉన్నాయి.
ఇక గ్రూప్-B లో శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ, ఇండోనేషియా జట్లు పోటీపడనున్నాయి.ఆగస్టు 28న థాయ్‌లాండ్ - హాంకాంగ్ మధ్య తొలి మ్యాచ్‌తో ఈ టోర్నీ ప్రారంభం కానుంది.
గ్రూపుల్లో టాప్-2 లో నిలిచిన నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి.
అభిమానులను ఉర్రూతలూగించే ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 13న జరగనుంది.





