Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జనగామలో ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు
ఆక్రమిస్తే కఠిన చర్యలని కమిషనర్ హెచ్చరిక
జనగామ, సెప్టెంబర్ 20 (క్విక్ టుడే న్యూస్):
జనగామ పట్టణ ప్రజలకు, పాదచారులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు జనగామ మున్సిపల్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫుట్‌పాత్ ఆక్రమణలను సిబ్బంది తొలగించారు.
రోడ్లు మరియు ఫుట్‌పాత్‌లపై అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్లు, బోర్డులు, తోపుడు బండ్లను తొలగించి రాకపోకలకు మార్గం సులువు చేశారు.
రోడ్ల ఆక్రమణల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని కమిషనర్ పేర్కొన్నారు.
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.
Tags:#General#National




