Back to FeedQuickToday Shorts

General
Aug 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మండల కేంద్రంలో పశువైద్యులే కరువు..! వైద్యం అందక రైతు బర్రె మృతి
సమయానికి వైద్యం అందలేదని రైతుల ఆరోపణ
శివ్వంపేట, ఆగస్టు 5 (క్విక్ టు డే న్యూస్): శివ్వంపేట మండల కేంద్రంలో పశువైద్యులు అందుబాటులో లేకపోవడంతో సమయానికి చికిత్స అందక రైతు రాములుకు చెందిన సుమారు రూ.60 వేల విలువైన బర్రె మృతి చెందిన ఘటన రైతుల్లో ఆందోళన కలిగించింది.
పశువైద్యులకు సమాచారం ఇచ్చినా ఆలస్యంగా స్పందించడంతో పశువును కాపాడలేకపోయామని రైతు కుటుంబం తెలిపింది.
మండల కేంద్రంలో విధులు నిర్వహించాల్సిన వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల మూగజీవాల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
పాడిపశువులే జీవనాధారమైన రైతులకు ఇది తీరని ఆర్థిక నష్టమని పేర్కొన్నారు.
మండల కేంద్రంలోనే 24 గంటల అత్యవసర పశువైద్య సేవలు అందుబాటులో ఉంచి, నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.



