Back to FeedQuickToday Shorts

General
Aug 7, 2026Short Read
బిల్లులు రాక పెరుగుతున్న వడ్డీ భారం....
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
ఉమ్మడి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలు చేసినా చివరి విడత బిల్లులు అందక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
ఖమ్మంలో 16,497 ఇళ్లకు 6,107, భద్రాద్రిలో 17,581 ఇళ్లకు 4,237 నిర్మాణాలు పూర్తయ్యాయి.
అప్పులు చేసి ఇళ్లు పూర్తి చేసిన వారు వడ్డీ భారం మోస్తున్నారు.కేంద్ర నిధుల విడుదల ఆలస్యమే కారణమని అధికారులు చెబుతుండగా,పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.





