Back to FeedQuickToday Shorts

General
Aug 28, 2026Short Read
రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో సాయి శ్రీ ఆద్య పుట్టినరోజు సందర్భగా సేవా కార్యక్రమం
జనగామ, ఆగస్టు 28 (క్విక్ టుడే న్యూస్):
జనగామ పట్టణంలోని రాజరాజేశ్వరి వృద్ధాశ్రమంలో పఠానేని అభిరామ్ దీప్తి అలేఖ్య దంపతుల కుమార్తె పఠానేని సాయి శ్రీ ఆద్య పుట్టినరోజు సందర్భంగా 25 కిలోల బియ్యం బ్యాగ్‌ను అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక పూట ఆకలిని తీర్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి.
నిత్యావసర సరుకులు, వస్త్రదానం చేయడం ద్వారా సామాజిక బాధ్యతను నెరవేర్చాలి.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యువత అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి.
ఈ ప్రయత్నాల ద్వారా భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేయాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సేవా కార్యక్రమంలో కర్రే వీరాస్వామి, సతీష్, నరేష్, జోగు భాస్కర్, కర్రి రాజశేఖర్, శంకర్, జోగు ఉదయ్, మను, నరేంద్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.





