
ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సత్కరించిన అజయ్ కుమార్...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి నూతన సూపరింటెం డెంట్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ముదిగొండ రామకృష్ణ ని సిద్దార్థ కాలేజీ ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వల్లభనేని అజయ్ కుమార్ మాట్లాడుతూ,మణుగూరు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వంద పడకల ఆసుపత్రి ఎంతో కీలకమైనదని అన్నారు.నూతన సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ నాయ కత్వంలో ఆసుపత్రి మరింత అభివృ ద్ధి చెంది,ప్రజలకు మునుపెన్నడు కనీవినీ ఎరుగని రీతిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
అలాగే,సిద్దార్థ కాలేజీ విద్యార్థులకు వైద్యరంగంపై అవగాహన,ఆసుపత్రి సేవలు,ప్రాక్టికల్ శిక్షణ వంటి అంశాల్లో భవిష్యత్తులో సహకారం అందించా లని కోరారు.ఈ కార్యక్రమంలో సిద్దార్థ కాలేజీ సిబ్బంది,విద్యార్థులు,ఆసుప త్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





