
మొక్కజొన్న చేనులో భారీ కొండచిలువ బీభత్సం
జనగామ, ఆగస్టు 05 (క్విక్ టుడే న్యూస్):
రఘునాథపల్లి మండలం కాంచనపల్లి గ్రామంలో భారీ కొండచిలువ కలకలం రేపింది. గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ మొక్కజొన్న చేనులో పనిచేస్తుండగా సుమారు12 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది.దీంతో భయభ్రాంతులకు గురైన స్వప్నను కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.స్వప్నను ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు, ఆమెపై దాడి చేసిన భారీ కొండచిలువను సైతం పట్టుకుని ఆస్పత్రి వద్దకు తీసుకురావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొండచిలువ దాడిలో గాయపడిన స్వప్నకు జనగామ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం స్వప్న ప్రాణాపాయ స్థితినుంచి బయటపడిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్ కల్నల్ మాచర్ల భిక్షపతి తెలిపారు. పంటపొలాల్లో పనిచేసే సమయంలో రైతులు,భారీ కొండచిలువ సంచారం నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు.విజ్ఞప్తి చేస్తున్నారు.





