Back to FeedQuickToday Shorts

National
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
Ai పూర్తిగా మనుషుల నియంత్రణలోనే ఉండాలి: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
టెక్నాలజీ ఎల్లప్పుడూ మానవాళికి సహాయపడేలా ఉండాలని, ముఖ్యంగా ఏఐ పూర్తిగా మనుషుల నియంత్రణలోనే పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఒకవేళ మనుషుల కంట్రోల్ తప్పితే, ఆ టెక్నాలజీని వాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.అలాగే, ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొన్ని పెద్ద కంపెనీల చేతుల్లోనే ఉండిపోకూడదని, ప్రపంచంలోని అన్ని దేశాలకు, సంస్థలకు దీని లాభాలు విస్తరించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు తమ మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన ఏఐ మోడల్స్ భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను అతి త్వరలోనే పబ్లిక్ కన్సల్టేషన్ కోసం అధికారికంగా విడుదల చేయనున్నట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు.



