
తుదిదశకు చేరిన అహ్మదాబాద్ విమాన దుర్ఘటన దర్యాప్తు
కేంద్ర పౌర విమానమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు
న్యూఢిల్లీ, జూలై15:
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరిందని కేంద్ర పౌర విమానమాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అతి త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన తుది నివేదిక వస్తోందని పేర్కొన్నారు. త్వరగా నివేదిక ఇవ్వడం కంటే.. ప్రమాదం అసలు నిజాన్ని బయటపెట్టడమే తమకు ముఖ్యమని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు చెప్ప్పుకొచ్చారు. గతేడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా ంఎ`171 బోయింగ్ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో పాటు భూమిపై ఉన్న 19 మంది.. మొత్తం 260 మంది మృతిచెందారు. ఈ ఘటనలో విమాన వ్యవస్థలు, బ్లాక్ బాక్స్ డేటా, ఇంజిన్ భాగాల విశ్లేషణలో ంంఎః కీలక పురోగతి సాధించింది.
Subscribe to Our Newsletter
Get the latest news delivered to your inbox.


