
ఉత్తర తెలంగాణకు వరం.. వరంగల్‌కు ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రం..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
తెలంగాణలోనే రెండో అతిపెద్ద ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఉత్తర తెలంగాణ ప్రజలకు శుభవార్త అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.ఈ నిర్ణయం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు.హనుమకొండలో ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం కానుండడం,ఎంజీఎం ఆసుపత్రిలో 9 కొత్త సూపర్ స్పెషాలిటీ సేవలు, ఐవీఎఫ్ కేంద్రం, ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు,కొత్త డయాలిసిస్ కేంద్రాలు అందుబాటులోకి రావడం ప్రజలకు మెరుగైన వైద్య సేవలను చేరువ చేస్తాయని తెలిపారు.వరంగల్‌లో ప్రత్యేక క్యాన్సర్ కేంద్రం ఏర్పాటుతో ఉత్తర తెలంగాణలోని వేలాది మంది క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన,అందుబాటు వైద్యం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కీలక ప్రాజెక్టును వరంగల్‌కు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహాకు కృతజ్ఞతలు తెలిపారు.





