Back to FeedQuickToday Shorts

Telangana
Sep 14, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఉల్లి ప్రియులకు భారీ షాక్.. త్వరలో సెంచరీ కొట్టనున్న ఉల్లి ధర! కేజీ రూ. 100కి చేరే అవకాశం!
హైదరాబాద్‌లో ఉల్లి ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి.
జూలైలో కేజీ రూ.
15 నుంచి రూ.
20 పలకగా, ప్రస్తుతం అది మూడుంతలు పెరిగి రిటైల్ మార్కెట్లో రూ.
70కి చేరుకుంది.
మలక్‌పేట మార్కెట్‌కు గతంలో రోజూ సుమారు 25 వేల బస్తాల ఉల్లి రాగా, ప్రస్తుతం అది 15 వేల బస్తాలకు పడిపోయింది.
కర్నూలు, అనంతపురం జిల్లాలలో వర్షాలు లేకపోవడం వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది.
మరోవైపు, నాసిక్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నీట మునిగింది.
సరఫరా తగ్గిపోవడంతో రానున్న వారం, పది రోజుల్లోనే కేజీ ఉల్లి ధర ఏకంగా రూ.
100కి చేరుకోవచ్చని మార్కెట్ వ్యాపారులు హెచ్చరిస్తున్నారు.
సామాన్యులకు ఇది మోయలేని భారంగా మారనుంది.



