Back to FeedQuickToday Shorts

Telangana
Sep 15, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
19 నుంచి రుతుపవనాల తిరోగమనం.. ఏపీ, తెలంగాణల్లో వానలు
నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నుంచి పశ్చిమ రాజస్థాన్ మీదుగా వెనక్కి మళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, అందులో ఏపీలో 43 శాతం, తెలంగాణలో 20 శాతం మేర లోటు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే, రుతుపవనాల తిరోగమన సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో ఈ నెల 21 వరకు వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలలో సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ మధ్య పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Tags:#Telangana#National#Shorts





