
దేశానికే రోల్ మోడల్‌గా మహేశ్వరం తెలంగాణ మోడల్ స్కూల్
మోడల్ స్కూల్‌ను సందర్శించిన సీ.ఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్, జూలై27(క్విక్ టడే న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం మహేశ్వరంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి విద్యాబోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన ఆయన విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై విలువైన సూచనలు చేశారు. చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటూ ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయం, వసతి గృహాలు, తాగునీటి, పారిశుద్ధ్య సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.





