
జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు
Jurala Dam: కర్ణాటకలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు భారీగా నీరు చేరుతుండగా దిగువకు నీటిని వదులుతున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది.
ఆదివారం రాత్రి నాటికి జూరాలకు 22,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది.
సోమవారం నాటికి ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు, నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జూరాల జలాశయంలో 5.897 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఎగువ నుంచి ఇదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువగా వరద కొనసాగితే జూరాల జలాశయం నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది.
అనంతరం అదనపు నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు.





