Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
రెండేళ్లలో టీచర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తా: సీఎం రేవంత్
కొడంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీచర్ల సమస్యలన్నీ రెండేళ్లలో పరిష్కరిస్తానని, అప్పటివరకు రోడ్డెక్కి ధర్నాలు చేయొద్దని కోరారు.
ఉపాధ్యాయులు ఆందోళనలకు దిగితే విద్యార్థుల మనసుల్లో ప్రభుత్వంపై ప్రతికూల భావన కలుగుతుందన్నారు.
తనకు రెండేళ్ల సమయం ఇవ్వాలని, సమస్యలన్నీ పరిష్కరించాకే 2028 చివర్లో లేదా 2029లో జరిగే ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తానని స్పష్టం చేశారు.
అప్పుడు తన పాలనకు వందకు వంద మార్కులు వేస్తారో, సున్నా వేస్తారో మీ ఇష్టమంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.





