Back to FeedQuickToday Shorts

Telangana
Sep 4, 2026Short Read
కొత్త పెన్షన్దారులకు బిగ్ రిలీఫ్.. సర్టిఫికెట్లు లేకున్నా అప్లై చేసే వెసులుబాటు!
తెలంగాణలో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఊరట కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది.
సర్టిఫికెట్లు చేతికి అందకపోయినా ముందే పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చని సెర్ప్ (SERP) తెలిపింది.
దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు రెవెన్యూ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర ఆలస్యం జరుగుతుండటంతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
అయితే, అధికారుల దరఖాస్తుల పరిశీలన సమయానికి మాత్రం ఆయా పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.
కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 15ను చివరి తేదీగా నిర్ణయించారు.
పత్రాల జారీ ఆలస్యమవుతున్నా ఆగకుండా అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.





