
పెళ్లి పీటల మీద అనూహ్య మలుపు: చివరి నిమిషంలో పెళ్లి వద్దన్న వధువు
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూల్ జిల్లాలో ఒక వివాహ వేడుకలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
పెళ్లి పీటల మీద కూర్చున్న వధువు, సరిగ్గా తాళి కట్టే సమయానికి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.వివరాల్లోకి వెళితే, బిజినేపల్లి మండలానికి చెందిన ఒక యువకుడితో లింగాల మండలానికి చెందిన యువతికి రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది.
వివాహ వేడుక కోసం బంధువులు, స్నేహితులు అంతా హాజరయ్యారు.
అంతా సజావుగా సాగుతున్న సమయంలో, వధువు తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
దీనితో చేసేదేమీ లేక ఇరు కుటుంబాల పెద్దలు కూర్చుని చర్చించి, వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా, పెళ్లి కోసం చేసిన ఏర్పాట్ల ఖర్చులన్నింటినీ అమ్మాయి తండ్రే భరించాలని గ్రామ పెద్దలు తీర్మానించారు.





