
రెండున్నర ఏళ్లలో
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం
హైదరాబాద్, జూలై 25 (క్విక్ టుడే న్యూస్):
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్న ప్రచారంలో నిజం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం 15–20 శాతం, ప్లాట్ల విక్రయాలు దాదాపు 40 శాతం పెరిగాయని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ గణాంకాలే దీనికి నిదర్శనమన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగరాభివృద్ధికి కీలక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు తెలిపారు. రూ.7,000 కోట్లతో మూసీ సుందరీకరణ తొలి విడత పనులకు త్వరలో టెండర్లు పిలుస్తామని, రూ.24,000 కోట్లతో 76 కిలోమీటర్ల మెట్రో విస్తరణ చేపడతామని వెల్లడించారు. భూభారతి చట్టంతో భూముల భద్రత కల్పిస్తున్నామని, సాఫ్ట్వేర్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.





