
మహేశ్‌కుమార్ గౌడ్‌కు యశస్విని రెడ్డి శుభాకాంక్షలు
టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవీకాలం పూర్తి
హైదరాబాద్:టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్ గౌడ్ రెండేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్‌రెడ్డి బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ సంస్థాగత బలోపేతం,కార్యకర్తలకు అండగా నిలవడం, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహేశ్‌కుమార్ గౌడ్ చేస్తున్న కృషిని వారు అభినందించారు.
పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..
సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోందన్నారు.పార్టీ,ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు.పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి పనిచేస్తామన్నారు.ఝాన్సీ రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ..
పార్టీ బలోపేతానికి మహేశ్‌కుమార్ గౌడ్ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు.
కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేస్తున్నారని పేర్కొన్నారు.



