Back to FeedQuickToday Shorts

Telangana
Aug 22, 2026Short Read
రాహుల్ గాంధీ తీరుపై కేటీఆర్ విమర్శలు!
ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండిస్తూ రాహుల్ గాంధీ ధర్నా చేయడంపై కేటీఆర్ సెటైరికల్‌గా ట్వీట్ చేశారు.
ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్న రాహుల్ గాంధీ, తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసినా ఎందుకు పట్టించుకోలేదని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసం ముందు రాహుల్ గాంధీ ధర్నా చేస్తారా అని నిలదీశారు.
తెలంగాణలో లాఠీచార్జ్ చేయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి రాహుల్ గాంధీ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా అని కేటీఆర్ తన ట్వీట్లో విమర్శించారు.





