Back to FeedQuickToday Shorts

Telangana
Sep 6, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అసెంబ్లీ వ్యూహాలపై నేడు కేసీఆర్ దిశానిర్దేశం.. ఎర్రవల్లిలో బీఆర్ఎస్ఎల్పీ భేటీ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ఎల్పీ భేటీ జరగనుంది.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సభలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన ప్రధాన ప్రజా సమస్యలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.



