Back to FeedQuickToday Shorts

Telangana
Aug 14, 2026Short Read
ఇందిరమ్మ ఇళ్లపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఉన్నత స్థానాల్లో ఉంటూ వేల కోట్లు దోచుకునే వారికి ఎలాంటి నిబంధనలు అడ్డురావడం లేదని, కానీ పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇచ్చే రూ.5 లక్షల బిల్లుల విషయంలో మాత్రం ప్రభుత్వం 500 రకాల రూల్స్ పెడుతోందని ఆయన మండిపడ్డారు.తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు.
లక్షల కోట్లు దోచుకుంటున్న వారి సంగతి తేలుస్తామని, వారి వెంట పడతామని ఘాటుగా స్పందించారు.
పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.





