Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్: అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త తెలిపింది.
2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.
తొలి విడత కింద సుమారు 1.35 లక్షల మంది విద్యార్థుల అకౌంట్లలో రూ.527.58 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
ఇందులో దాదాపు 13 శాతం (రూ.66 కోట్లు) స్కాలర్షిప్ల రూపంలో అందించారు.
కాగా, రాష్ట్రంలో అడ్వాన్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ప్రతి ఏడాదీ రూ.2,300 కోట్ల నిధులను విడుదల చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే.



