Back to FeedQuickToday Shorts

Telangana
Sep 5, 2026Short Read
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే మా లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కోడంగల్ సభలో ఆయన మాట్లాడుతూ...
అధికారంలోకి వచ్చిన నాటికి విద్యా రంగంలో 28వ స్థానంలో ఉన్న తెలంగాణను, ప్రస్తుతం 17వ స్థానానికి తీసుకువచ్చామని తెలిపారు.గడిచిన రెండు సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరడం గర్వకారణమన్నారు.
తాము కూడా ప్రభుత్వ బడుల్లో చదువుకునే ఈ స్థాయికి ఎదిగామని, అందుకే విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు.
ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తూ సుమారు 25 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించామని సీఎం వివరించారు.





