Back to FeedQuickToday Shorts

Telangana
Aug 1, 2026Short Read
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్!
క్విక్ టుడే న్యూస్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అందించారు.
ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లించాలన్న ఆయన ఆదేశాల మేరకు, మెజారిటీ ఉద్యోగుల ఖాతాల్లో ఈరోజు జీతాలు జమయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, పెన్షనర్లు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించారు.
అలాగే, వివిధ కార్పొరేషన్ల పరిధిలో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు సైతం నేడే తమ జీతాలు అందుకున్నారు.
సీఎం నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





