Back to FeedQuickToday Shorts

Telangana
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఇందిరమ్మ ఫ్రీ కుట్టు మిషన్లు.. నాలుగు రోజులే సమయం!
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషిన్' పథకానికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 2.90 లక్షల మందికి పైగా ఈ ఫ్రీ కుట్టుమిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 15వ తేదీ మాత్రమే చివరి గడువుగా ఉంది.
గడువు ముగిసిన వెంటనే, మండల స్థాయిలో MPDOలు మరియు మున్సిపాలిటీలలో కమిషనర్లు దరఖాస్తులను పరిశీలిస్తారు.
ఆ తర్వాత కలెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ తుది అర్హుల జాబితాను ఎంపిక చేస్తుంది.
ఎంపికైన లబ్ధిదారులకు సుమారు రూ.12 వేల విలువైన కుట్టు మెషిన్లను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయనున్నారు.
గడువు సమీపిస్తున్నందున అర్హులైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించడమైనది.



