Back to FeedQuickToday Shorts

Telangana
Sep 11, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నల్లమల పులిలా కబుర్లు.. ఏపీ విషయానికి వచ్చేసరికి పిల్లి : హరీష్ రావు
తెలంగాణలో ఇక్కడి రైతుల పొలాలు, పంటలు సాగునీరు అందక ఎండిపోతుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కృష్ణా జలాలను ఏపీకి తరలించేందుకు సహకరిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సొంత రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి పక్క రాష్ట్రానికి నీళ్లు ఎత్తిపోస్తున్నారని దుయ్యబట్టారు.
తాము నల్లమల పులి అంటూ గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వ్యవహారానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా పిల్లిలా మారుతున్నారని ఎద్దేవా చేశారు.
కేవలం రాజకీయ లబ్ది కోసం, చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకునేందుకే ఈ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని పంప్‌హౌస్‌లలో మోటార్లు ఆపేశారని, పాలమూరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



