Back to FeedQuickToday Shorts

District
Aug 11, 2026Short Read
చేయూత పెన్షన్‌కు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ప్రభుత్వం అందిస్తున్న చేయూత పెన్షన్ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలని మున్సిపల్ చైర్మన్ తూనం శ్రవణ్‌కుమార్ కోరారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులు తదితర అర్హులు అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అర్హత ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, తొర్రూరు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.





