
ప్రజల సమస్యలకు వేదికగా మండల స్థాయి ప్రజావాణి..
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆగస్టు 17(క్విక్ టుడే న్యూస్)
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండలవ్యాప్తంగా ప్రజల నుంచి వివిధ సమస్యలపై అధికారులు అర్జీలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి,ఎంపీడీవో వెంకటేశ్వర్లు,తహసీల్దార్ శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య, మెడికల్ ఆఫీసర్ జ్వలిత,మండల వ్యవసాయ అధికారి రాంనర్సయ్యతో పాటు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.మండల స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి, వాటిని వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.





